Feb 12, 2025, 01:02 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్
సికింద్రాబాద్: సుబ్రమణ్య స్వామి సేవలో మాజీ మంత్రి
Feb 12, 2025, 01:02 IST
పద్మారావునగర్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్య స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి సందర్శించారు. తైపూసం ఫాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, స్వామివారి పరిమళ ప్రసాదాలను అందచేశారు. బీజేపీ నాయకులు చంద్రపాల్ రెడ్డి, గుంటి సత్యనారాయణ ఉన్నారు.