Sep 21, 2024, 08:09 IST/
దారుణం.. ఐదుగురు కలిసి ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు (వీడియో)
Sep 21, 2024, 08:09 IST
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నడిరోడ్డుపై ఐదుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. ఓ వ్యక్తిని కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ సంచలనం కలిగించింది. సాహిల్ పాశ్వాన్ అనే వ్యక్తిని పొరుగు వారే వ్యక్తిగత కక్షలతో కొట్టి చంపినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విశాల్, వివేక్, విక్రమ్, అక్షయ్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఐదో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.