Oct 24, 2024, 16:10 IST/
నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
Oct 24, 2024, 16:10 IST
TG: నల్గొండ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్ శివారులో చందంపల్లి స్టేజీ వద్ద ప్రమాదం పొలం నుంచి తిరిగివస్తుండగా ఓ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.