నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించిన బాపూజీ

60చూసినవారు
నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించిన బాపూజీ
కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ నిజాం రాజును అంతమొందిచడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించారు. నలుగురు యువకులకు షోలాపూర్‌ క్యాంపులో శిక్షణ ఇచ్చారు. వారిలో ఒకరైన నారాయణరావు పవార్‌ 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్‌ బజార్‌లో బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. పవార్‌ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్‌ చేశారు.

సంబంధిత పోస్ట్