రాష్ట్రంలో చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని బుధవారం సిపిఎం హర్షం వ్యక్తం చేసింద. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ పై కూడా చెత్తపై యూజర్ చార్జీలు కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని విశాఖ జీవీఎంసీ 78వ వార్డు సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగా రావు కోరారు. అలాగే ఆస్తి ఆధారిత ఆస్తి పన్ను కూడా రద్దు చేస్తున్నట్లుప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.