గాజువాక: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం అగనంపూడి టోల్గేట్ వద్ద బైకును లారీ ఢీకొనడంతో భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ అతి వేగంగా వచ్చి బైక్ ను ఢీకొనడంతో మృతులు లారీ చక్రాల కింద నలిగిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.