దేశవ్యాప్తంగా పేపర్ లెస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే అనేక విభాగాల్లో డిజి లాకర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలోని ఏయూ అధికారులు, విద్యార్థులు ధ్రువపత్రాలను డిజిటలైజ్ చేసే పనిని ప్రారంభించారు. 1996 నుంచి 2023 వరకు వర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు సంబంధించిన సుమారు 23 లక్షల ధ్రువపత్రాలను డిజిటలైజ్ చేసే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించారు.