అగనంపూడి పునరావస కొలనికొండయ్యవలస ప్రజల ఆరాధ్య దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి మారువార పండుగ మహోత్సవం శుక్రవారం కమనీయముగా జరిగింది. పండు మహోత్సవం పురస్కరించుకొని ఆలయంను, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతః కాలం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరువరం అయినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం విశేషం. భక్తుల తాకిడితో అమ్మవారి ఆలయం కళకళలాడింది. అమ్మవారిని దర్శనం చేసుకున్న గ్రామ పెద్దలు బలిరెడ్డి సత్యనారాయణ, పిల్లా కొండలరావు, మరిశ రామచంద్రరావు మాట్లాడుతూ నూతనముగా ఏర్పడిన మడిమాంబ, బంగారమ్మ ఆలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం మరిడిమాంబ పండగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.
శ్రీ మరిడిమాంబ ఆశీస్సులు కమిటీకి, గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత భక్తుల పై ఉండాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ శ్రవ్యమైన ఎంతో మధురముగా అమ్మవారి పారాయణము ఆలపించిన శ్రీ మరిడిమాంబ మహిళా మండలివారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బలిరెడ్డి శేఖర్, బుదిరెడ్డి కన్నారావు, పిల్లా సురేష్ కుమార్, బుదిరెడ్డి పైడ్రాజు,సిరందాసు రాము, కరణం సన్యాసిరావు, పిల్లా కేశవ ప్రసాద్, పలక సాయి, విందుల నవీన్, శ్రీమతి కర్రీ అప్పలనరసమ్మ విందుల రామ తులసి బాయ్, బలిరెడ్డి వెంకట్ లక్ష్మి, విందుల లీల, పిల్లా లక్ష్మి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.