గాజువాక మండలం అగనంపూడి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కొండయ్యవలస ప్రజల ఆరాధ్య దేవత మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం బుధవారం అత్యంత వైభంగా జరిగింది. తెల్లవారినుండె కొండయ్యవలస, పెదమడక, దానబోయినపాలెం, దిబ్బపాలెం మరియు అగనంపూడి పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మరిడిమాంబ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి పండుగ మహోత్సవం పురష్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు.