అగనంపూడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అగనంపూడి జాతీయ రహదారి ప్రధాన కూడలిలో రహదారి భద్రత, వాహన చోదుకులు పాటించాల్సిన భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర చోదకులు హెల్మెట్ ను విధిగా ధరించాలని అలాగే అతివేగం, త్రిబుల్ డ్రైవింగ్, మద్యపానం చేసి, ఇయర్ ఫోన్స్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చేయకూడదని అన్నారు.