వీల్ చైర్ వితరణ చేసిన స్నేక్ సేవర్ సొసైటీ

265చూసినవారు
వీల్ చైర్ వితరణ చేసిన స్నేక్ సేవర్ సొసైటీ
స్నేక్ సేవర్ సొసైటీ తరఫున కొండయ్యవలస గ్రామం నివాసి కరణం అమ్మాజీకి గురువారం వీల్ చైర్ వితరణ చేశారు. జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస నివాసి పెరాలసిస్‌తో నడవడానికి ఇబ్బంది పడుతున్న కరణం అమ్మాజీ (58సం) కి స్నేక్ సేవర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 వేల రూపాయలు విలువచేసే వీల్ చైర్‌ని ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ అందజేశారు. కార్యక్రమంలో స్నేక్ సేవర్ సొసైటీ ప్రతినిధులు పి.బిషాయ్, తలారి అప్పలరాజు, ఇ.సన్యాసి నాయుడు, కె.సూర్యనారాయణ, యస్.తిరుమలరావు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్