Apr 07, 2025, 18:04 IST/
బిగ్ బాస్ 9వ సీజన్ హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ?
Apr 07, 2025, 18:04 IST
తెలుగు ప్రేక్షకులను ‘బిగ్ బాస్’ షో విజయవంతంగా 8 సీజన్లు అలరించింది. త్వరలో 9వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్‌కు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. కొత్త సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో బాలకృష్ణ హోస్ట్‌గా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్యతో బిగ్‌బాస్ నిర్వాహకులు చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.