హుకుంపేట: భార్యను నరికి చంపిన భర్త

66చూసినవారు
హుకుంపేట: భార్యను నరికి చంపిన భర్త
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం గన్నేరుపుట్టులో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కత్తితో నరికి చంపిన సంఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, మధ్యాహ్నం భార్య-భర్తల మధ్య గొడవ జరిగిన సందర్భంగా, భర్త తీవ్ర ఆగ్రహంతో భార్యను నరికి పరారయ్యాడు. ఈ దంపతులు పని కోసం ఒడిస్సా నుంచి వచ్చారని స్థానికులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్