Jan 29, 2025, 17:01 IST/
రోజూ బ్లాక్ కాఫీ తీసుకుంటే మధుమేహం దరిచేరదు: నిపుణులు
Jan 29, 2025, 17:01 IST
మనలో చాలా మందికి ప్రతి రోజూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. పాలు, చక్కెర కలపకుండా చేసే కాఫీని 'బ్లాక్ కాఫీ' అని అంటారు. "ఈ బ్లాక్ కాఫీని పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ క్యాలరీలు, పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో హృద్రోగాలు, మధుమేహం వంటి వాటి ముప్పును తగ్గించే అవకాశం ఉంది. లివర్ ఆరోగ్యానికి, శరీర మెటబాలిజం మరింత వేగవంతమయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది." అని నిపుణులు సూచిస్తున్నారు.