రాబిస్ వ్యాధి పై అవగాహన కలిగి ఉండడం అవసరమని పశు వైద్యులు డాక్టర్ బాబురావు పడాల్ అన్నారు. శుక్రవారం కోటఉరట్ల మండలం కె. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం షేక్ అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ర్యాబిస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాబిస్ వ్యాధి నివారణకు ఈనెల 6న ప్రపంచ జూనోసెస్ డే సందర్బంగా ప్రతి పశు వైద్యశాలలో ఉచిత టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.