మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామ దేవత అయిన శ్రీ మోదకొండమ్మ
అమ్మవారికి అమ్మవారి మెడలో వెండి పూలదండ నిమిత్తం గ్రామానికి చెందిన తిరిమిశెట్టి బైరాగి వరహాలమ్మ దంపతులు కుమారుడు రామకృష్ణ ఉమాదేవి దంపతులు 25 వేల రూపాయలు గురువారం విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి సంజీవరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శ్రీనివాసు శర్మ, కొండలరావు పాల్గొన్నారు