మాడుగుల.. పాల రైతులతో రేపు విశాఖ డైరీ వద్ద మహా ధర్నా

54చూసినవారు
మాడుగుల.. పాల రైతులతో రేపు విశాఖ డైరీ వద్ద మహా ధర్నా
విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29న విశాఖ డెయిరీ వద్ద జరుగు మహదర్నాను జయప్రదం చేయాలనీ సిపిఎం మండలకార్యదర్శి ఇరట నరసింహమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం విరనారాయణo పాలకేంద్రంవద్ద పోస్టర్ విడుదల చేసారు. విశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్ల నుండి సేకరిస్తున్న పాల ధరలను తగ్గించడం అన్యాయమన్నారు. నేడు వ్యవసాయ రంగం లాభసాటిగా లేక పోవడంతో, యువతి యువకులు పాడి పై ఆధారపడ్డారన్నారు.

సంబంధిత పోస్ట్