ఈ నెల 26, 27 తేదీల్లో తుఫాను ప్రభావంతో అధిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉంటూ, తగు సూచనలు పాటించాలని మాడుగుల మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మాడుగుల మండలంలో 10 శాతం వరి పంట కోతలు పూర్తయ్యయన్నారు. ఈ తరుణంలో తుఫాను బారిన పడకుండా ఇప్పటి వరకు కోత కోయని రైతులు తుఫాన్ ప్రభావం తగ్గే వరకు 4 నుండి 5 రోజులు వరకు కోతలు కోయడం వాయిదా వేసుకోవాలన్నారు.