మాడుగుల.. వ్యక్తిగత అవసరాలతో ఇసుక వ్యాపారం చేస్తే కఠినచర్యలు

69చూసినవారు
మాడుగుల.. వ్యక్తిగత అవసరాలతో ఇసుక వ్యాపారం చేస్తే కఠినచర్యలు
వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్థానిక తహసిల్దార్ కే రమాదేవి స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ సొంత అవసరాల పేరుతో ఇసుకను వ్యాపారంగా మార్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకు ఎక్కువ ఇసుకను అందించాలన్న దృక్పథంతో జిఎస్టిని, సీనరేజ్ని రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఇసుక కనీసం మూడు మీటర్ల ఎత్తు ఉన్న చోట్ల ఒక మీటర్ ఇసుక మాత్రమే తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్