ఈ నెల 28, 29తేదీలలో సీపీఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాతనగర్‌లో జరుగనున్నాయని, 28న ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్ కాలేజీ నుండి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు తెలిపారు. బుధవారం జగదాంబ సిపిఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు మహాసభల గోడపత్రికను విడుదల చేసారు.