పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాగి జావ పంపిణీ కార్యక్రమం అక్కయ్యపాలెంలోని జ్ఞాననికేతన్ స్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్ సునీత కుమారి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవడంతోపాటు శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా ఉంటుందని హెమో గ్లోబిన్ స్థాయిలు పెరిగి గుండె కండరాల స్థాయిలు పెరిగి ఆరోగ్యంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.