రాయపూర్ నుంచి విశాఖకు వందేభారత్ రైలు
ఈ నెల 15వ తేదీ నుంచి రాయపూర్ నుంచి విశాఖకు వందేభారత్ రైలు నడపనున్నారు. ఆ తర్వాత దుర్గ్ నుంచి ఈ రైలును నడపనున్నారు. రోజూ ఉదయం దుర్గ్‌లో బయలుదేరి రాయపూర్, లఖోలి, టిట్లాఘర్, రాయగడ, విజయనగరం మీదుగా మధ్యాహ్నానికి విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి బయలుదేరి రాత్రికి దుర్గ్ చేరుకోనుంది. ఈ విషయాన్ని గురువారం విశాఖలోని రైల్వే అధికారులు వెల్లడించారు.