విశాఖలోని ప్రసిద్ధి చెందిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మూడో గురువారం పూజలు వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలో 20 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. అమ్మవారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం శ్రీ అమ్మవారి పంచామృతాభిషేకంలో 19 మంది ఉభయదాతలు పాల్గొన్నారు.