ముత్యాలమ్మ బీచ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం బీచ్ వద్ద మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహం కుళ్ళిపోయి బాగా ఉబ్బి ఉంది. కుడి చేతి పై ఫ్లైయింగ్ ఈగల్ పచ్చబొట్టు ఉంది. 15 రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిస్తే 9440796038 నెంబర్కు సంప్రదించాలని సిఐ మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.