పరవాడ: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మండల కేంద్రమైన పరవాడలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.