ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రైవేట్ పీఏను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తొలగించడం జరిగిందని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. హోం మంత్రిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై వెంకటేష్ స్పందించారు. సోమవారం నక్కపల్లిలో వెంకటేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పీఏపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చేయని, అవి రుజువు కాలేదనే విషయాన్ని అమర్నాథ్ తెలుసుకోవాలన్నారు.