కోటవురట్ల కి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి

60చూసినవారు
కోటవురట్ల కి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి
సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటవురట్లకు చెందిన మానేపల్లి సింహాద్రి (19) అనే యువకుడు మృతి చెందాడు. గురువారం విజయనగరం జిల్లా కొత్తవలస బంధువుల ఇంటికి వెళుతుండగా చిన్నయ్యపాలెం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్