ఘనంగా మరిడమ్మ అమ్మవారి మహోత్సవం

61చూసినవారు
పెందుర్తి నియోజకవర్గంలోని సింహాచలం సమీప అడవివరం గ్రామ పొలిమేర దేవత మరిడమ్మ పండుగ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పైడితల్లి అమ్మవారి శతకంపట్టు వద్దకు గ్రామస్తులు, మహిళలు పసుపు కుంకుమలు, చీరలు, అమృత కలశలతో చేరుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారి చెక్కబొమ్మని పూజారి వంశీయులు శిరస్సుపై పెట్టుకుని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్