ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐఎంఏ

54చూసినవారు
ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐఎంఏ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్వీ అశోకన్ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా కమిటీ ఐఎంఏ కోల్‌కతా శాఖ వైస్ ప్రెసిడెంట్ హోదా నుంచి ఘోష్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్‌ 9న ఈ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్