నేలమీద కూర్చొని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాళ్ళు మడిచి కింద కూర్చొని తినడాన్ని సుఖాసనం అని పిలుస్తారు. ఈ ఆసనంలో కూర్చొని తినడం వలన జీర్ణసమస్యలన్ని తొలగిపోతాయని చెబుతారు. దీనితోపాటు మనం తీసుకునే ఆహారం సవ్యంగా జీర్ణం కావడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. కింద కూర్చొని తినడం ద్వారా మానసిక ప్రశాంతత, పని భారం రెండు తగ్గిపోతాయి. సుఖాసనంలో కూర్చొని తినడం నరాలకు కూడా చాలా మంచిది.