విశాఖ జిల్లా సింహాచంలో సింహాద్రి అప్పన్నను రాష్ట్ర హోమ్ మినిష్టర్ వంగల పూడి అనిత సోమవారం దర్శించుకున్నారు. మంత్రి అనితకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అయిన తరువాత అప్పన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానని అనిత తెలిపారు.