వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచలం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ అశోక్ గజపతిరాజు శుక్రవారం వేకువజామున సింహాద్రి అప్పన్నను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.