సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్నోడు పూలకుండీని ఎందుకు తన్నాడనే ప్రశ్నకు తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ ఇచ్చారు. "సినిమాలో చిన్నోడికి పెద్దోడు అంటే చాలా ఇష్టం. అయితే పెద్దోడికి గెలవాలనే తపన లేకపోవడంపై చిన్నోడికి కొంత కోపం ఉంటుంది. చెల్లెలి పెళ్లిలో వెంకటేశ్ చిన్నోడిని నాటకాలు వేసుకోపో అనడంతో ఆ కోపాన్ని అన్న మీద చూపించలేక ఆ పూలకుండీని తన్నేస్తాడు. అదొకరకమైన బాధను చూపించడమే" అని శ్రీకాంత్ తెలిపారు.