AP: కాకినాడ గ్రామీణం తోట సుబ్బారావునగర్‌కు చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రకిశోర్ ఈ నెల 14న తన పిల్లల్నీ చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో తమకు సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. అందులో తమ పిల్లలు సరిగ్గా చదవట్లేదని, ఈ పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరని, వాటిని తాను చూడలేననే భావనతో మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు చెప్పారు. అందుకే ఆ నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు.