నవ వధువు ఆత్మహత్య

59చూసినవారు
నవ వధువు ఆత్మహత్య
TG: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో నవవధువు చర్చిత(20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందిన చర్చిత, జడ్చర్లకు చెందిన పవన్‌ గత నెలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో చర్చిత ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన పవన్‌ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్