బీహార్‌కు చెందిన ఖుష్బూకి టెన్త్‌లో 399 మార్కులు సాధించింది. ఒక్క మార్కు తేడా రావడంతో పేరెంట్స్ ఆమెను బలవంతంగా సైన్స్‌కు బదులు ఆర్ట్స్‌లో చేర్పించడంతో ఖుష్బూ కన్నీటిపర్యంతమైంది. ఆ వీడియో చూసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖుష్బూకి ఫోన్ చేశారు. సైన్స్ విభాగంలో అడ్మిషన్ కోసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని ఖుష్బూకు తెలియజేస్తూ.."నీట్ పరీక్షలకు సిద్ధంగా ఉండు. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోమని" ఆయన భరోసా కల్పించారు.