విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పరామర్శించారు. గాయపడిన ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలియదని సీఎంకు తెలిపారు. క్షతగాత్రులు షాక్‌లో ఉన్నారని సీఎం అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.