కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో జివిఎంసి ప్రధాన కార్యాలయానికి చేరుకొని అందరికీ ఆమె స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.