విశాఖ: గోల్ఫ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం

73చూసినవారు
విశాఖ: గోల్ఫ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం
విశాఖలో గోల్ఫ్ క్లబ్ కార్యకలాపాలు విస్తృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో జాతీయ స్థాయి సన్ ఇంటర్నేషనల్, వైజాగ్ విస్టా లేడీస్ గోల్ఫ్ కప్ - 2025 పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ విస్తరణకు అవసరమైన భూమిని 2014-19లో తాను మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించామన్నారు.

సంబంధిత పోస్ట్