'ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి'

157చూసినవారు
ఎలమంచిలి మున్సిపాలిటీ లో ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన పెంచుకోవాలని.. ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి కోరారు. 20 వార్డు లో పర్యటించిన ఆమె పలు సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మున్సిపాలిటీలో ఇకనుండి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పరిస్థితి నిర్వాహకులకు అందజేయాలని అదేవిధంగా చెత్త సేకరణ పై ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాలని మున్సిపాలిటీ ప్రజలు అందరూ సహకరించాలని ఆమె కోరారు.

ఈ పర్యటనలో భాగంగా కౌన్సిలర్ దాసరి చిన్నమ్మలు కుమార్ మాజీ సర్పంచ్ కోడిగుడ్డు రమణబాబు మున్సిపల్ సిబ్బంది స్థానిక సచివాలయ సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్