రేవు పోలవరం: పదో తరగతి విద్యార్దులకు స్టడీ మెటీరియల్
రేవు పోలవరం జడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు మాజీ సర్పంచ్ చోడిపిల్లి బంగారి తన సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఉచితంగా మంగళవారం అందించారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, పాఠశాలను ప్రథమ స్థానంలో ఉంచాలని బంగారి ఆకాంక్షించగా.. ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లా శ్రీను అభినందనందించారు.