31 నుంచి ఏపీలో ‘వాలంటీర్ల నివేదన’

53చూసినవారు
31 నుంచి ఏపీలో ‘వాలంటీర్ల నివేదన’
ఈ నెల 31 నుంచి ఏపీలో ‘వాలంటీర్ల నివేదన’ కార్యక్రమం నిర్వహిస్తామని వాలంటీర్ల అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. మూడు నెలల బకాయిలు ఇవ్వాలని, రూ.10 వేల జీతం హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఎన్నికల్లో రాజీనామా చేసిన లక్ష మంది వాలంటీర్లను తిరిగి విధుల్లో తీసుకోవాలని పేర్కొంది. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్