తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

60చూసినవారు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేవలం 65,299 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 20,297 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. శుక్రవారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్