AP: ఈడ్పుగల్లు రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇతరులు భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. 'సెంటు భూమి కబ్జా చేసినా తాటా తీస్తాం.. జాగ్రత్తగా ఉండాలి. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు.. జైలు గుర్తుకు రావాలి' అని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.