ఎన్నికల సమయంలో టీడీపీ రైతాంగానికి పెట్టుబడి సాయం రూ. 20వేలు ఇస్తామని ప్రకటించిందని, ఆహామీని నిలబెట్టు కోవాలని రైతు సంఘం పెంటపాడు మండల అధ్యక్ష, కార్యదర్శులు చిర్ల పుల్లారెడ్డి, వెంకటరావు డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం పెంటపాడు మండలం జట్లపాలెం సచివాలయం వద్ద నిరసన నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాట్లుదెబ్బతిన్నాయని వారు తెలిపారు. రంగారావు, శ్రీను పాల్గొన్నారు.