అణగారిన వర్గాల అభ్యున్నతికి, కార్మిక హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎంవీఎన్ కపర్ధీ ఆశయ సాధనే లక్ష్యంగా సీపీఐ శ్రేణులు పనిచేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సీపీఐ ఉద్యమ నేత, కార్మికోద్యమ నాయకులు ఎంవీఎన్ కపర్ధీ 43వ వర్ధంతి సందర్భంగా శనివారం భీమవరం శ్రీనివాస ధియేటర్ సెంటర్లో సీపీఐ స్ధూపం వద్ద కపర్ధీ చిత్రపటానికి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించారు.