ఏపీఎస్ఆర్టీసీ ప. గో. జిల్లా ప్రజా రవాణా అధికారిగా ఎన్. వి. ఆర్ వరప్రసాద్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఏ. వీరయ్య చౌదరి పదవి విరమణ చేయడంతో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పని చేస్తున్న వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరికి యూనియన్ నాయకులు వై. వి రావు అల్లం నారాయణ, సిహెచ్ సత్యనారాయణ శాలువలు కప్పి పూలదండలతో సత్కరించారు.