తాగునీరు అందించాలని ఖాళీ బిందెలతో నిరసన

73చూసినవారు
తాగునీరు అందించాలని ఖాళీ బిందెలతో నిరసన
తమ ప్రాంతానికి తాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ భీమవరంలోని లంకపేటకు చెందిన మహిళలు బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ నాయకులు ఎం. వైకుంఠరావు మాట్లాడుతూ తాగునీటి సమస్య గత మూడు రోజుల నుంచి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యను సకాలంలో పరిష్కరించకపోవడం వల్లే తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్