ఏలూరు జిల్లా చింతలపూడి మండలం బుధవారం సంతోష్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేసారు.పట్టణంలో అనాథలకు, వృద్దులకు, షెల్టర్ లలో ఉండే వారికి 50మందికి భోజనం అందించారు.సంస్థ అధినేత రవి మాట్లాడుతూ ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ తరుపున కొన్ని వందల సహాయ కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రవి,టీమ్ సభ్యులు పాల్గొన్నారు.