సోమవారం నుండి నరసాపురం డిపో నుండి మచిలీపట్నం మీదుగా హైదరాబాద్ కు నాన్ ఏసి సూపర్ లగ్జరీ బస్సు నూతన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తెలిపారు. ఈ బస్సు నరసాపురం బస్టాండ్ నుండి ప్రతి రోజు రాత్రి 08. 00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07. 00 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం రాత్రి 08. 00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07. 00 గంటలకు నర్సాపురం చేరుకుంటుందని తెలియజేశారు.